మనసు పంజరం
ఆకాశ వీధిలో హాయిగా
విహరించే
పక్షులపై కవితలు
రాసుకున్నా
విహంగ వీక్షణంలో
నన్ను నేను చూసుకున్నా
సాయం సంధ్యలో ఎంతో
దగ్గర నుంచి
రివ్వున ఎగురుతూ
సవ్వడి చేసే
చిలకమ్మలను చూసి
అనుభూతులే నెమరు
వేసుకున్నా
వాన చినుకుల ఒత్తిడికి
లయబద్దంగా కదులుతున్న
పెరటిలోని గులాబీలను
చూసి
ఏమి రాజసమని
మురిసిపోయా
చల్లని తిమ్మెరలకు
నాట్యం చేసే నీ
కురులను చూసి
భావాలను అల్లుకున్నా
విరిసే నీ పెదాల
మెరుపుల్లో
నా ప్రతిబింబమే
చూసుకున్నా
ఎగిరే పక్షుల పయనాన్ని
ఆపాలని అనుకోలేదు
గులాబీ సోయగాన్ని
చిదిమేయాలనుకోలేదు
పెదాల మెరుపులపై
నల్లపూత పూయలేదు
నీలాల కురులతో
స్వప్నాల జడలు
అల్లాలని ఆరాటపడ్డా
సవ్వడి చేసే చిలకమ్మలో
అనంతమైన స్వేచ్ఛనే
చూశా
చిలకమ్మను
పంజరంలో బంధీని చేయాలని
అనుకోలేదు
మనసునే పంజరంలా మలిచి
అనుభూతులను బంధీ
చేసుకున్నా
లోహపు కడ్డీల పంజరంలో
నివసించేది
లోహవిహంగమేనని నాకు
తలుసు
మనస్వినీ
No comments:
Post a Comment