Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday, 9 September 2015

నా మనసుపైనే డౌట్!!!

నా మనసుపైనే డౌట్!!!

కుదుటపడాలని తపిస్తున్న మనసు
కుదురుకోలేక పోతున్నది
మంటలు రేపుతున్న మనసుపైనే
కొత్త గాయం తగులుతున్నది
ఆర్తిగా దరికి చేరిన మనసుభావాల
నిజాయితీని మనసే
శంకిస్తున్నది
తీపి సరదాల వెనుక
చేదునే వెతుకులాడుతున్నది
పిలవకనే చేరువైన మనసును
చులకన చేసి నిందిస్తున్నది
మనసుతో గడిపిన ఘడియల
అర్ధమే మార్చివేస్తున్నది
అన్నీ తెలిసిన మనసే
నిందలు వేస్తున్నది
సుధలు కురిపించిన మనసే
అంతా మాయేనని వాదిస్తున్నది
వలచిన మనసు కురిపిస్తున్న
శరపరంపరకు
నా మనసే తల్లడిల్లుతున్నది
గడిచిన ఘడియలను తరచి చూస్తే
అమృతక్షణాలు
మదిని పలకరిస్తున్నవి
అయినా
నా మనసు
తనను తానే నమ్మలేకున్నది
ఏది నిజమో
ఏది భ్రాంతియో
తెలియని మనసు
వగచి వగచి విలపిస్తున్నది
నిజమేనా
మనసు శంకలు నిజమేనా
నేను గడిపినవి
అమృత ఘడియలు కావా
నా పలుకులు
ఆ మనసు తీయని పులకింతలు
ఏది నిజం...
నా మనసు నిజం కాదా
ఇప్పుడు
నా మనసుపైనే
నాకు అనుమానం
మనస్వినీ

No comments:

Post a Comment