అల్లరి కృష్ణుడినే
నవ మన్మధుడిని కానే
కాను
కన్నుసోకిన పడతులపై
వలపు బాణాలు
సంధించలేను
క్రీగంటి చూపుతో
వనితల మనసు
కొల్లగొట్టలేను
కృష్ణ పరమాత్ముడను
కాను
అన్ని మందిరాలలో
రాసలీలలు ఆడలేను
గోపికల వలువల చోరీ
నాకు చేతకానే కాదు
మగువల మనసున చొరబడేందుకు
అబద్దాలు అవలీలగా
ఆడలేను
బాద్ షా అక్బర్ నూ
కానేకాను
పడతుల సంఖ్య
పెంచుకోలేను
నచ్చిన వనితకు
నవ మన్మధుడినే
గుండె గుడిలో కొలువైన
మనోహరికి
నల్లనయ్యనే
మనసైన సఖియ చెంత
అల్లరి కృష్ణుడినే
అదే నా నడత కాదు
అది నాకు వ్యసనం కానే
కాదు
నా అల్లరి
నా కొంటెతనం
నా సరసం
నా విరసం
అన్నీ
మనసైన
నీకే అంకితం
మనస్వినీ
No comments:
Post a Comment