♣♣♣ HAPPY BIRTHDAY PRINCE ♣♣♣
నా కంటి చూపుల
వెలుగులు ఆరిపోతాయి
నా పలుకులు శాశ్వతంగా
మూగబోతాయి
నా శ్వాస నన్ను వీడి
అనంతవాయువుల్లో కలిసిపోతుంది
నా దేహం పుడమి గర్భంలో
కలిసిపోతుంది
నేనుండను
ఎవరికీ కనిపించను
నా మరణం నన్ను మాయం
చేస్తుంది
అయినా నేనుంటాను
నా మాటలు వినిపిస్తాయి
నా కన్నులు వెలుగుతూనే
ఉంటాయి
నా అడుగుల జాడలు
సజీవంగానే కనిపిస్తాయి
నా ప్రతిరూపంగా నీవు
నేలపై నడియాడుతూనే
ఉంటావు
నిన్ను చూసిన ఎవరైనా
నన్నే తలుచుకుంటారు
నాజన్మకు సార్ధకం నీవు
నా శ్వాసకు ఊపిరే నీవు
నా మాట నీవు
నా నడక నీవు
నా నడత నీవు
నా విజయంలో నీవు
పరాజయంలో నీవు
నా ఒప్పులో నీ చిరునవ్వే
నా తప్పును
సరిదిద్దేదీ నువ్వే
నేను మరణించినా
నన్ను చిరంజీవిగా
మార్చేదీ నీవే
అంతంలోనూ
నాకు ఆరంభాన్నే
కానుకగా ఇచ్చే
మై డియర్ ప్రిన్స్ కు
నా మనసునిండా
జన్మ దిన శుభాకాంక్షలు
మనస్వినీ
{16 సెప్టెంబర్ మా ఇంటి
యువరాజు, మా ప్రిన్స్, ఆరిఫుద్దీన్
షేక్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు }
No comments:
Post a Comment