అనుబంధంలోనే
అనుభవం
భావ యుక్తం నా మానసం
ఉద్విగ్న భరితం నా
అంతరంగం
రసరమ్యం నా ఆలోచనం
కడలి కల్లోలం నా హృదయం
మనసు కేరింతలలో
వికసించే పుష్పం నా
రచనం
జారిపడే కన్నీటిలో
రోదించే కావ్యం నా
భావం
అన్ని ఘడియల్లో ఒకేలా
ఉండదు
నా అక్షరం
పూదోటలో పుష్పికను
చూసి ప్రణమిల్లే
చిరుగాలి నా కవిత్వం
పూవులపై వాలి తేనీయను
దొంగిలించే భ్రమరం
కాదు
నా గీతం
కుసుమించే వనంలో
కవ్వించే పూబాలలు
ఎందరున్నా
అందంగా ఆకట్టుకున్నా
వయ్యారంగా చిందేసినా
మాటల మాయలు చేసినా
వలపు బాణాలు సంధించినా
స్పందించని జడపదార్థమే
నా తత్వం
నా మనసు ఒక భ్రమరమే
అనుకుంటే
ఈ భ్రమరం అనుభవానికి కాదు
అనుబంధానికే
ప్రణమిల్లుతుంది
మనస్వినీ
No comments:
Post a Comment