యుద్ధ క్షేత్రం
ఇరువైపులా యుద్ధ
ట్యాంకుల గర్జన
దూసుకువస్తున్న అగ్ని
గోళాలు
పేలుతున్న మందుపాతరలు
ఆకాశవీధిలో లోహవిహంగాల
విన్యాసాలు
జెట్ స్పీడ్ లో
దూసుకువస్తూ
నేలను భస్మీపటలం
చేస్తున్న బాంబులు
అంతటా హాహాకారాలు
ఎటు చూసినా
విలయతాండవాలు
దట్టమైన పొగ
గుడ్డిదీపమూ లేని కటిక
చీకటి
ఏ పక్షం ఎటునుంచి దాడి
చేస్తుందో తెలియదు
ఒకరిని మించి ఒకరు
ఎత్తులు వేస్తూ
శాంతి సీమను నెత్తుటి
నేలగా మారుస్తున్నారు
ఎవరు ఎందుకు దాడి
చేస్తున్నారో
ఎవరు ఎవరిని
చంపుతున్నారో తెలియదు
నాకు మాత్రం అంతా
తెలుసు
దాడి చేసేది ఎవరో
బాధితులు ఎవరో నాకు తెలుసు
ఎందుకంటే అంతా నేనే
దాడి చేసే పక్షమూ నేనే
మరణించే వర్గమూ నేనే
సమరము చేస్తున్నది నా
భావాలే
ఇది సిరియా యుద్ధ
క్షేత్రం కాదు
నా మనోసీమలో
జరుగుతున్న రణం
నా భావాలకు మానవరూపం
ఉంటే
జరిగేది మారణహోమమే
నా హృదయం ఒక యుద్ధ
క్షేత్రమే కాదా
మనస్వినీ
అహో ఏమా ఘోరకలి బ్రదర్ రోజూ యుద్ధం చేయందే జరగదే లేవాలంటే యుద్ధం, మొహం కడగాలంటే యుద్ధం, తయారవ్వాలంటే యుద్ధం ఆఫీసుకు పోవాలంటే యుద్ధం..... బతుకే యుద్ధం కదా.... మరోమాటుంటే సెలవీ బ్రదర్.... సారీ నేను ఈ పోస్టు పెట్టడానిక్కూడా యుద్ధం చేశా... ఏమనుకుంటారో అని...చివరాకరికి పెట్టేశా.....
ReplyDeleteనిజమే బ్రదర్ జీవనం సమస్తం సమరం..
Delete