రక్తం పీల్చే బంధాలు
కరెన్సీ కట్టల సమాధిలో
పవళించింది అనుబంధం
స్వార్ధమనే పడగనీడలో
సేదతీరుతోంది మమకారం
స్వప్రయోజన కాంక్షలో
రగులుతోంది బంధుత్వం
పునాదులను మరిచి
బాటలను విడిచి
తల ఎగురవేస్తోంది
అహంకారం
ఎక్కడ వెతకను అనుబంధాలను
ఎలా చుంబించను
మమకారాలను
ఏమని సమీక్షించను
బంధుత్వాలను
మనసుకు కానరాదు
అనుబంధం
హృదిలో వెలగదేమి
మమకారం
రాబందుల్లా రెక్కలు
ఆడిస్తోంది బంధుత్వం
స్వార్ధమే వీరి విధానం
మోసమే వీరి జీవనం
వ్యాపారమే వీరి
అనుబంధం
డొల్లతనమే వీరి
అహంకారం
రక్తసంబంధాలు కాదు
ఇవి రక్తం పీల్చే
బంధాలు
మనస్వినీ
No comments:
Post a Comment