శ్రీమతీ ఒక
బహుమతీ
మనసు తోటలో పుష్పించిన
భావం
బోసినవ్వులు
నవ్వుతోంది
కనురెప్పల తెరలపై
వెలసిన చిట్టి స్వప్నం
కేరింతలు వేస్తోంది...
ఒక ఆశగా వికసించిన
భావం
కొత్త పుంతలు
తొక్కుతోంది
మనసున మనసైన మనస్వినిని
మనసు బహుమతి
కోరుతోంది...
ఎందుకో మనసు కొత్త
ఉదయం కోసం
ఉవ్విళ్ళూరుతోంది
బహుమతిగా మారిన
శ్రీమతినే
మరో బహుమతి
కోరుతున్నది...
నేను నీకు ఇచ్చేది
ఏముంది
నువ్వే నాకు బహుమతి
అయినప్పుడు
అందుకే అడుగుతున్న
మనసారా
మరో బహుమతి ఇమ్మని...
అవును నాకు చిన్నారి
కానుక కావాలి
చిట్టిపొట్టి ఆశలు
రేపాలి
నీలో నారూపం
ఉదయించాలి...
మనమున్నా లేకున్నా
మనరూపం నేలపై మన
ఉనికిని చాటాలి
నీలా నవ్వే మరో రూపం
కావాలి
నీ నవ్వులు శాశ్వతం
కావాలి...
శ్రీమతివైన నీవు
బహుమతివైన నీవు
చిన్నారి కానుక
నాకిస్తావా
మనస్వినీ...
No comments:
Post a Comment