లైఫ్ లైన్
గజిబిజి నడకల
వైకుంఠపాళీ జీవితం
ఫణిరాజుల వనమే తప్ప
నిచ్చెనలే లేని చిత్రం...
చిన్నపాము మింగేసి
విసిరేస్తే
పెద్దపాము మాయం
చేస్తోంది...
పడగ విప్పిన పాముల
విలయనాట్యం
కానరాని నిచ్చెనకోసం
ఆరాటం...
ఉన్నదో లేదో తెలియని
నిచ్చెన
అదే మారుతోంది బతుకు
ఆశకు వంతెన...
ఒక్క అవకాశంకోసం
ఉబలాటం
తప్పదేమో
బతుకుపోరాటం...
దూరపు కొండలను చూడదు
నా నేత్రం
గడ్డిపోచనే ఆసరా
కోరుతోంది మానసం...
చివరి లైఫ్ లైన్ దిశగా
కదులుతోంది పాదం
తేల్చిపారేస్తాడో
ముంచేస్తాడో
ఇక ఆ దేవుడి ఇష్టం
మనస్వినీ...
No comments:
Post a Comment