భావ సంగమం
తరగని దాహానికి
చిరు చినుకువై
నిలిచావు
పెరిగిన తమకానికి
సాంత్వనవై పలకరించావు
ఒరుగుతున్న సూరీడుని
చల్లని వెన్నెలవై
పలకరించావు
కనురెప్పలలో దాగిన
స్వప్నాలను
అందమైన పువ్వులుగా
మలిచావు
మోసం చేస్తున్న ఎండ
మావులపై
పన్నీటి వాన
కురిపించావు
నువ్వెప్పుడూ అంటూ
ఉంటావు
నిన్ను చూస్తే నా
భావాలన్నీ మారిపోతాయని
నిజమే నిను చూడగానే
పురివిప్పే నా భావాలు
చదివితే
మనసు మతలబులు
తెలుస్తాయి
మనసు బాసలూ తెలుస్తాయి
ఆవేదనలు చుట్టు
ముట్టినా
ఆవేశాలు అలుముకున్నా
ఎద సీమలో కంపనాలు
రేగినా
నా భావాలు నిత్యం
పదిలమే
మనుసును తాకిన
అనుభవాలతో
నా భావాలు నిత్యం
సంగమిస్తూనే ఉంటాయి
మనస్వినీ
No comments:
Post a Comment