వానా వానా వందనం
భారీ వర్షం
కాదు
అలాగని సన్నని
తుంపర కాదు
చినుకుల
సవ్వడి వినిపిస్తూనే ఉంది
వీనుల విందుగా...
అది ప్రకృతి
కాంత ఆడుకునే గిటార్ కాబోలు
పుడమిని
తాకుతున్న చినుకులు
లయబద్డంగా సంగీతం
వినిపిస్తున్నాయి...
ఎక్కడినుంచో
మట్టి వాసన
కమ్మగా
వస్తోంది
మట్టివాసనతో
కలిసి
మరుమల్లెల
సుగంధం
ముక్కుపుటాలను
తాకింది...
మత్తుగా
కవ్విస్తున్న జవ్వనిని చూసాను
గదిని
సుగంధభరితం చేసింది
తన జడలోని
మల్లెలే...
మూసి ఉన్న గది
తలుపులను చూసిన నాలో
తలపుల తలుపులు
తెరుచుకున్నాయి
పరువాల
గవాక్షాలను తెరిచిన సుందరి
వలపు వలలు
విసురుతూ
కొంటెగా
నవ్వుతోంది...
ఆగలేనని మారాం
చేసింది వయసు
వీలుకాదంటూ బెట్టు
చేసింది సొగసు
అవునంటూ
కాదంటూ సాగిన సమరంలో
కరిగిపోయింది
పొగరు...
ఒకరి గెలుపుకు
మరొకరు సహకరిస్తూ
స్వేదం చిందిన
తనువులు
లతల్లా
అల్లుకున్నాయి...
ఇంకా ఓపలేనంటూ
చిరుజల్లులు
హోరువానలా
కురవసాగాయి
వాన చినుకుల జోలపాటలో
అలసిన దేహాలు
మత్తులోకి జారిపోయాయి...
మధురస
సమరానికి
తోడు నిలిచిన
వానకు
వందనం చెప్పక
తప్పదుగా
మనస్వినీ...
No comments:
Post a Comment