క్షణం
క్షణం
జారవిడుచుకోను ఏ
క్షణాన్ని
వదులుకోను ఏ ఘడియనూ
ప్రతి క్షణమూ నాకు
మధురమే
ప్రతిఘడియా మనసుకు
అంకితమే
నిన్నటి ఘడియ కోసం
ఈ ఘడియలో జీవించను
రేపటి క్షణం కోసం
ఈ క్షణంలో మరణించను
జారిపోనివ్వను ఈ
ఘడియను
కరిగిపోనివ్వను
ఈ క్షణాన్ని
కాలమనే మాయలో
కరిగిపోయే క్షణాన్ని దోసిటపట్టి
కన్నుల్లో కలగా
మలుచుకుని
మనసులో పదిలం చేసుకుంటా
వేదనలు మిగిల్చే
ఘడియలో
ఆనందాన్ని వెతుక్కుని
అందమైన పువ్వులా
మనసులో నాటుకుంటా
రేపటి చిత్రం ఎలా
ఉంటుందో
వచ్చే ఘడియ ఏ మలుపు
తిరుగుతుందో
కొత్తగా పలకరించే
క్షణం
గుండెను ఎలా తాకుతుందో
నిన్నను మరచి
రేపటిని విడిచి
నేటిని అక్కున చేర్చి
నీతో గడిపే ఘడియను
ప్రేమించి
నీ క్షణాలనే నా
క్షణాలుగా మలిచి
నీ చిరునవ్వులే నా
నవ్వులుగా వెలిగించి
గుండె గుడిలో నీ
ప్రమిదను కొలిచి
జీవమున్న క్షణాలలో
మరణించిన నేను
అంతిమ క్షణాలలో
జీవించాలని తపిస్తున్నా
నా ఘడియలను అమృత
ఘడియలుగా
నా క్షణాలను దివ్య
క్షణాలుగా మలిచేది నీవే
క్షణం క్షణం నా జీవం
నీవే
మనస్వినీ
No comments:
Post a Comment