చిన్నగీత పెద్దగీత
సమస్యగా మారిన గీత
సరసన
పెద్దగీతను చేర్చితే
ఆ గీత చిన్న గీత
అవునేగానీ
సమస్య మారునా
పెద్దగీత జడిపించినా
చిన్నగీత ఆమోదమగునా
సమస్యకు మరో సమస్యే
పరిష్కారమైతే
అది ఆత్మవంచనే గాని
సాంత్వన అగునా
గీత మీద గీత
ఆపైన మరో గీత
సమస్యల వలయమే కదా
మనస్వినీ
No comments:
Post a Comment