మరమనుషులే ముద్దు
మనసు నిండా నవ్వులు
నాకొద్దు
విరిసే పెదాల మాటున
విషాదం తొలగించు
ముళ్ళను గుచ్చే
పువ్వులు నాకొద్దు
కనులకింపైన ప్లాస్టిక్
పువ్వులే నాకు ముద్దు
కన్నీరు తుడిచే స్నేహం
నాకొద్దు
కన్నీరే లేని కన్నులు
నాకు ముద్దు
ఆసరాగా నిలిచే నేస్తం
నాకొద్దు
వెన్నుపోటు తెలియని
మరమనిషే నాకు ముద్దు
అన్నదమ్ముల ఆప్యాయతలు
నాకొద్దు
ఆప్యాయంగా పలకరించే
మట్టిమనుషులే నాకు ముద్దు
సలాములు చేసే గులాములు
నాకొద్దు
మనసును గుర్తించే
చిరునవ్వే నాకు ముద్దు
జిగేల్ మనిపించే
వేడుకలు నాకొద్దు
గుడ్డిదీపంలో ఆనందాలే
నాకు ముద్దు
పంచభక్ష్య పరమాన్నం
నాకు వద్దు
ఆకలి తీర్చే పప్పన్నం
నాకు ముద్దు
పరపతి పెంచే
సిరిసంపదలు నాకొద్దు
తలదించని స్వాభిమానమే నాకు
ముద్దు
నువ్వైనా నేనైనా
మనసున్న వారెవరైనా
ఆ దేవుడే దిగివస్తే
కోరుకునేది
ఇంతేకదా
మనస్వినీ
No comments:
Post a Comment