ఫిరంగీ
గడియారం
పరుగులు తీసే కాలం
మానని గాయాలకు లేపనం
ఎవరో చెప్పగా విన్నాను
ఏదీ ఆ కాలం రానే
రాదేమీ...
పలకరించే నవ్య క్షణం
గడిచిన క్షణం వేదనను
తీర్చునని అంటారు
ఏదీ ఆ క్షణం
పలకరించదేమీ...
మానని గాయం మంటలు
ఆరకముందే
కొత్త కాలమేదో
ముల్లులా దిగబడితే
గడిచిన క్షణం ఆనవాళ్ళు
మరవకముందే
మరో క్షణం శరములా గాయం
చేస్తే
ఏ సమయం ఉపశమనం...
గడిచిన ఘడియల ఘాతములు
తడి ఆరకముందే
కరిగిన క్షణాల జ్ఞాపకాలు
మదిలో చెరగక ముందే
కొత్త ఘడియలు వేదనల
పల్లకీలు మోస్తే
గడియారం చేసే శబ్దం
గుండెల్లో ఫిరంగీలు
మోగించదా
మనస్వినీ...
No comments:
Post a Comment