Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday, 18 July 2016

మైలురాయి

మైలురాయి

కన్నులలో వెలుగు రేఖలు లేనే లేవు
తారాడే చీకటిలో నా కలలు మాత్రం
సజీవంగానే ఉన్నాయి
కృశించిన దేహంలో నడిచే సత్తువే లేదు
పరుగులు తీసే కాంక్ష మాత్రం
రగులుతూనే ఉంది
నీలి నింగిని కాన్వాసు చేయలేను
అందమైన బొమ్మలు గీయాలనే తపన మాత్రం
చల్లారనే లేదు
కంటి చూపుతో ఎవరినీ శాసించజాలను
నా కన్నులు మాత్రం
ఇంకా తెరుచుకునే ఉన్నాయి
మనసు భావాలను
పువ్వులుగా పూయించలేను
అంతరంగంలో మాత్రం
పరిమళాలు గుభాళిస్తూనే ఉన్నాయి
సుదూరతీరాల గమ్యాన్ని చేరలేను
జీవనం పయనంలో దాటిన
మైలురాళ్ళు మాత్రం
విరగబడి నవ్వుతూనే ఉన్నాయి
గమ్యాన్ని ముద్దాడకున్నా
తీరాలను దాటకున్నా
ఒక మైలురాయిలా మాత్రం
నిలిచే ఉంటా
మనస్వినీ

No comments:

Post a Comment