అభిమానమై మెరిసిపోవాలనీ...
సమిధగా మారాను
మమతల ప్రమిదలు
వెలిగించాలని...
చేతులు చాచాను
ప్రేమపుష్పాలు దోసిట
పట్టాలని...
కన్నీరునై ఒలికిపోయాను
అమృతమై
కురిసిపోవాలని...
జీవంలేని నవ్వునయ్యాను
అందరి పెదాలపై నవ్వులు
పూయించాలని...
ఆకాశంలో మెరిసే తారకలు
నా చుట్టూ
నవ్వులపువ్వులు
అన్నీ నావే
అనుకున్నాను
అందరివాడిలా
మిగిలిపోవాలని...
నాకంటూ ఏదీ దాచక
పరులదేదీ దోచక
అనుబంధాలనే నమ్మాను
అభిమానమై
మెరిసిపోవాలని...
నింగిలో తారకలు
నవ్వుతున్నాయి
నవ్విన పెదాలు మూతి
విరుస్తున్నాయి
ఒక మిథ్యలా
మిగిలిపోయానని...
నేను నాటిన గులాబీ
మొక్కలే
ఇప్పుడు ముళ్ళను
విసురుతున్నాయి
మనస్వినీ...
ex lent
ReplyDelete