పడగ విప్పిన ఆకలి
దాచుకోకు ఏదీ
రేపటికోసం
ధారపోసేయ్ అమృత ఘడియలు
మనసునిండా
ఎదకనుమలో పువ్వులు
వికసించగా...
కన్నుల వెన్నెల
కురిపించు కాసింతనూ విడవక
మనసుమైదానంలో ఉషస్సులు
ప్రజ్వరిల్లగా...
బింబాధర మధురసం
కురిపించు
అమృతం కురిసే రాతిరే
ఇది కాదనక...
బిడియపడకు పరువాల
పరదాలలో
సొగసుల తెరలు ఎత్తు
ఏదీ కాదనక...
బుసకొట్టే సర్పం
నీదేహం
అల్లుకో నన్ను
కొదమనాగినివై
అంగాంగమూ అంకితమవ్వగా...
బాహు సంకెలలో బంధీవై
నా ఊపిరిలో నీ శ్వాసను
నింపు
అంతరాత్మను తట్టి
లేపగా...
ఏదీ దాచుకోకు నీలో
రేపటికోసం
కొసరి కొసరి వడ్డించు
ఈ క్షణం
పడగవిప్పిన ఆకలి
చల్లారగా...
మనసులు కలిసిన మనం
తనువుల సంగమంలో నిత్యం
పునీతం
రేపటి ఆశకాదు మనం
ఈ క్షణమే మన జీవితం
మనస్వినీ...
No comments:
Post a Comment