అల్లరి పువ్వులు
తనేదో పనిలో బిజీ బిజీ
తనేమో తనను చూస్తూ
బిజీ
ఎటు వెళితే అటు
ఎక్కడ కూర్చుంటే
అక్కడే
భూమి చుట్టూ తిరిగే
సూర్యుడిలా
గుంభనంగా తనుంటే
అల్లరి మొగ్గలా తను
మౌనసంద్రమై తను
ముభావమైతే
పిల్ల నది పరవళ్ళు తను
తన కంట కన్నీరు
ఉబికితే
తన కళ్ళలో నీరు
నింపుకునే అమ్మతనం తను
అమ్మతనం మాయమై పసితనం
మొదలై
తను కీచులాటకు దిగితే
కొంటెగా ముక్కు గిల్లి
పారిపోయే కుర్రతనం తను
చీకటిలాంటి నిశబ్దంలోనూ
నవ్వుల పువ్వులు
రువ్వేది తను కాదు తనూను
ఒకరు విరిసే నవ్వు
మరొకరు కుసుమించే
పువ్వు
తల్లీ తనయలు కాదు
మనసైన స్నేహానికి
ఆనవాళ్ళు
ఒకరు నా తనయ
మరొకరు నా
మనస్వినీ
No comments:
Post a Comment