Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday, 20 July 2016

దేవుడినీ చంపేస్తారా

దేవుడినీ చంపేస్తారా 

తెలుసా మీకు ఇస్లాం
చదివారా ఎప్పుడైనా ఖురాన్
తెలుసుకున్నారా దాని పరమార్థం
ఎవరిపైన మీ పోరాటం
ఎవరిపైన మీ ఆగ్రహం
ఇస్లాం పరిరక్షకులేనా మీరు
ఏది పవిత్ర యుద్ధం
ఏది ధర్మ పోరాటం
ఎక్కడ రాసి ఉంది జిహాద్ చేయమని
ఎవరు చెప్పారు ప్రాణాలు తీయమని
ప్రపంచ పెత్తందారి అమెరికా తొత్తులు మీరు
ఐసిస్ పేరుతో మారణహోమం చేసే రాక్షసులు మీరు
దమ్ముంటే అమెరికాతో నేరుగా పోరాడండి 
మీ శత్రువు ఎవడో వాడితో తలపడండి
ఎందుకు అమాయకులను చంపుతారు
ఇదేనా ధర్మయుద్ధం
మీరు చంపేది
రోజూ చచ్చేదీ
ఎవరో తెలియదా మీకు
బాగ్దాద్ గుండెల్లో మండుతున్న శవాలు ఎవరివి
సిరియా నరమేధంలో తెగిపడుతున్న తలలు ఎవరివి
ఇస్లాం పవిత్ర క్షేత్రం మదీనాలో బాంబులు వేసిన మీరు
ముస్లింలు ఎలా అవుతారు
ఎంతమందిని చంపుకుంటూ పోతారు
చివరకు దేవుడినీ చంపేస్తారా 

No comments:

Post a Comment