సమరణం
చిరుగాలి సవ్వడికే
చిగురుటాకులా
వణుకుతోంది ప్రాణం
కునుకుపట్టిన
మరునిమిషమే
అదురుతోంది నయనం
రేయీ పగలూ తేడాలేకుండా
కలవరపడుతోంది మానసం
ఏమయ్యింది నాటి
నిబ్బరం
ఎక్కడ కరిగింది నాటి
సంకల్పం
నలభై మంది ముష్కరుల
దాడికీ
ఎదురొడ్డి నిలిచిన
దేహం
దూసుకువచ్చిన తూటాలకు
సవాల్ విసురుతూ
ఒడుపుగా తప్పుకున్న
లాఘవం
ఎక్కడకు పోయింది నాటి
గుండెధైర్యం
ఏమైపోయింది నాటి వైభవం
కనులముందే కరకు కత్తుల
పోట్లు
కర్ఫ్యూ నీడలో ఒంటరి
విహారం
విధినిర్వహణలో ఎనలేని
సాహసం
ఒంటరి కార్యాచరణ
అంతుపట్టని శోధన
సుడిగుండాలను లెక్క
చేయని
ధిక్కరణ
ఎందుకు ఇప్పుడు అంతా
మారిపోయింది
ఎందుకు ఇప్పుడు కలవరం
మొదలయ్యింది
ఇది మనసులో గూడుకట్టిన
భయమా
ఆవిరవుతున్న నిబ్బరమా
కరిగిపోతున్న స్వప్నమా
వెక్కిరించే పరాజయమా
మరణానికి మార్గమా
పడిలేచేముందు కెరటం
చూపే నిగ్రహమా
ఇది మరో సమరానికి
సంకేతమా
ఏమవుతున్నదో
తెలియదుకానీ
ఏదో జరిగిపోతోంది
మనస్వినీ
No comments:
Post a Comment