నీ పేరే మరిచిపోయా
కనుల భాష నేర్చుకున్నా
కంటి చూపుతోనే
పలకరించుకున్నా
కంటి ముందు నడియాడిన
దేవిని
చూపులనే పిలుపులుగా
మలుచుకున్నా
చెంతనే ఉన్న పడతిని
మునివేళ్ళతో
తడుముకున్నా
పేరు పెట్టి పిలవలేదు
మనసు పెట్టి పులకరించా
వాలిన కనురెప్పల్లో
గీటిన కన్నులలో
వేల జవాబులు
వెతుక్కున్నా
క్రీగంటి ప్రశ్నలకు
మనసుతోనే సమాధానాలు
చెప్పుకున్నా
తటపటాయింపులో
బదులే లేక
మౌనంగా తలవంచి
స్మృతులెన్నో వల్లే
వేసుకున్నా
అవును
నేను నిత్యం నీతో
మాటలకు అందని భాషలో
ఊసులెన్నో
చెప్పుకున్నా
మనసూ మనసుల భాషలో
కనురెప్పల పలకరింతలో
గులాబీ పెదవుల
విరుపులో
చిలిపి సరిగమలో
మనోభాష సంగమంలో
నేను
నీ పేరే మరిచిపోయా
మనస్వినీ
No comments:
Post a Comment