అందాలరాశి
చీకటమ్మ పరువాలను
దోచేసి
నల్లని కన్నులను చేసి
చందమామ వెన్నెలను
దోసిటపట్టి
అందమైన మోమును కడిగి
సిగ్గులమొగ్గ గులాబీ
రేకులను కోసి
పెదాల మెరుపులుగా
అద్ది
మరుమల్లెల సోయగాలను
నఖములుగా తీర్చి
దిద్ది
మేఘమాలికల మెరుపులను
మేని పరువాలుగా మలిచి
కోయిలమ్మ రాగాలను
కంఠములో కూర్చి
ఎంతో ఓపికగా మలిచాడు
ఆ దేవుడు నిన్ను
ప్రకృతి రమణీయతను
ఒంటి నిండా అలుముకున్న
దేహం ముందు
సౌందర్య సాధనాలు
మెరిసే ఆభరణాలు
నవీన ఆలంకరణలు
దిగదుడుపే కాదా
మదినిండా రసికతను
నింపుకుని
పనులన్నీ మానుకుని
నీ బొమ్మను తయారు
చేసిన దేవుడికి
ప్రణమిల్లదా నా మనసు
అందానికే భాష్యం
నేర్పే నీవు
ప్రకృతి ఒడిలో పెరిగిన
దేవ కాంతవే కాదా
నా మనసులో ముద్ర వేసిన
నీ అందానికి
అలంకారాలు నేర్పే
సాధనాలు
ఇంకా పుట్టనే లేదు
మనస్వినీ
No comments:
Post a Comment