హృదయాంజలి
ఎగసిపడే కెరటానికి
బంధం వేసావు
అల్లకల్లోల కడలిని
నిర్మలం చేసావు
నిశి వీధుల అడుగుల్లో
కాంతి రేఖలా నిలిచావు
అలసిన మార్గంలో
సత్తువ నింపావు
అందని జాబిలి అరచేతిలో
రాకున్నా
పండు వెన్నెలనే
కానుకగా ఇచ్చావు
ఎవరు నీవు
నీలో ఏముంది
ఎక్కడినుంచి వచ్చావు
నీ మనసు గుడిలో
ప్రమిదను చేసావు
నా ఊపిరికి
వెచ్చదనాన్ని అందించావు
కన్నీటి సుడులలో
గూడు కట్టుకున్నావు
నా పెదాల మెరుపువు
నీవయ్యావు
నా మాటలకు
తూటాగా పేలిపోయావు
శూన్యమనే బాటలో
వెలుగురేఖగా మిగిలావు
బంధానికి మనసును జత
చేసి
అనుబంధంగా మిగిలావు
నీ మనసు వేదనను
నా మనసుకు లేపనంగా
అద్దావు
మనసు భావమును చదివిన
నేను
సర్వ బంధాలను వదిలి
జగతి బంధనాలను వీడి
నీ బాటలో జతగూడాను
నా అడుగులకు జాడవై
నిలిచిన నీకు
నా ప్రతి అక్షరం
ప్రణమిల్లుతోంది
ముద్దాడుతున్నాయి
నా అక్షరాకుసుమాలు
నీ మనసును
అందుకో
నా హృదయాంజలి
మనస్వినీ
No comments:
Post a Comment