గాలికి గాయమా
తూరుపున ఉదయించే
సూర్యుడిని కాను
పడమటి దిక్కున
అస్తమించను
పాలవెన్నెల కురిపించే
నెలవంకను కాను
కరి మబ్బుల కౌగిట
బంధీని కాను
విరబూసే వసంతాన్ని
కాను
రాలే ఆకులకు తలవంచను
కొండలను కోనలను తాకే
పవనమే నా మానసం
అన్ని కాలాల్లో
అన్ని రుతువులను
తట్టుకుని
వికసించే పుష్పం
నా అనురాగం
ఉదయభానుడికి అస్తమం
తప్పదు
నెలరాజు చీకటి గుహకు
బంధీ కాకపోడు
ఆకులు రాలుతాయ్
పువ్వులూ వాడిపోతాయ్
స్వచ్ఛమైన పవనం
నా ప్రణయం
గాలికి గాయం చేసే
ముళ్ళు
ఇంకా పుట్టనే లేదు
మనస్వినీ
ఆకులు రాలుతాయ్
ReplyDeleteపువ్వులూ వాడిపోతాయ్
స్వచ్ఛమైన పవనం
నా ప్రణయం..so nice feel