నాతో స్నేహం
చేస్తావా
అన్నింటికీ మూలం నీవే
ప్రతి చర్యకూ కారణం
నీవే
ప్రతి క్షణమూ నీవే
ప్రతి ఘడియా నీవే
దశవూ నీవే
దిశవూ నీవే
నా కంటి కొలనులో నీవు
పెదాలపై చిరునవ్వూ
నీవే
నా వేదనలో
నా రోదనలో
నా లాస్యంలో
నా రౌద్రంలో నీవే
నా విజయంలోనూ
పరాజయంలోనూ నీవే
నీ ఆలోచనలే అమలు
పరిచావు
అనుకున్నదే చేశావు
నీ కనుసైగలనే
అడుగులుగా
నీ ఆలోచనలనే జాడలుగా
నీ అంతరంగాన్నే
నా జీవనంగా మలిచావు
నీ ఆటలో పావునే నేను
నీ క్రీడలో బొమ్మనే
నేను
ఆడుకోవాలనే నీకుంటే
మనసెందుకు ఇచ్చావు
నాలో ఆలోచనలను ఎందుకు
రేపావు
భావాలను ఎందుకు
చిగురింపజేశావు
కష్టాలు ఎందుకు
ఇచ్చావు
కన్నీళ్లను ఎందుకు
మిగిల్చావు
ఎవరికి చెప్పుకోవాలి
నేను
ఎవరితో పంచుకోవాలి
నేను
ఎవరు అర్ధం
చేసుకుంటారు నన్ను
ఎవరికి తెలిసేను నేను
ఎవరు తట్టిలేపేరు
నన్ను
అందరూ నీ ఆటలో బొమ్మలే
అందరూ నీ చదరంగంలో
పావులే
అయినా చెప్పుకోవాలని
ఉంది
గుండె విప్పాలని ఉంది
అన్నీ నీకే తెలిసినా
అన్నీ నీవే చేస్తున్నా
నీ ముందే మనసు పరచాలని
ఉంది
నిన్నే అడగాలని ఉంది
నిన్నే నిలదీయాలని
ఉంది
నీముందే విలపించాలని
ఉంది
నీ సహాయమే కోరాలని
ఉంది
నువ్వే వస్తావా
నన్నే రమ్మని కబురు
చేస్తావా
అంతర్యామివి నువ్వు
అన్నీ నీ చేతుల్లోనే
ఉన్నాయి
నాకు ఆసరా ఇవ్వు
నాకు భరోసా కల్పించు
ఇలలో విసిగిన మనసుకు
కలోనైనా ఊరటనివ్వు
ఎక్కడో ఉండి ఎందుకు
ఆటలు
నాముందుకు దిగిరా
తొలినాటి నుంచి నిన్ను
తూలనాడిన నేను
నిజం తెలిసి
గమ్యం ఎరిగి
నిన్నే స్నేహంగా
మలుచుకున్నా
భగవాన్
నాతో స్నేహం చేస్తావా
నాకిప్పుడు
దేవుడితో స్నేహం చేయాలని
ఉంది
మనస్వినీ
No comments:
Post a Comment