Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday, 14 July 2020

రాజకీయాలనుంచి జర్నలిజం వైపు...(PART-5)


రాజకీయాలనుంచి
జర్నలిజం వైపు...(PART-5)
అసలు నా జర్నలిజం ఎంట్రీ చిత్రంగా ఉంటుంది. తొలి అడుగులు ఫన్నీగా ఉంటాయి. నవ్వితే నవ్వుకోండి ఉన్నదే చెబుతా.. బేసిక్ గా నేను జర్నలిజం చదువుకోలేదు, బిసిజె, ఎంసీజేలు నాకు తెలియవు. సాదా సీదా BA డిగ్రీ అంతే.. అప్పట్లో నాకు రాజకీయాలంటే ఆసక్తి.. యూత్ కాంగ్రెస్ లో తిరిగేవాడిని... మా ఎమ్మెల్యే సుధీర్ కుమార్... అప్పట్లో మా జల్ పల్లి మలక్ పేట్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉండేది. అలా మా ఎమ్మెల్ల్యే సుధీర్ కుమార్ తో పరిచయం ఏర్పడింది. ఆయన నన్ను జల్ పల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు. అంతే మనం జల్ పల్లికి సియం అయిపోయినట్లు బిల్డప్ ఇచ్చుకునేవాళ్ళం అనమాట. ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ హడావిడి చేసేవాడిని. ఇదే సమయంలో జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు పడమటి శ్రీధర్ రెడ్డితో బాగా పరిచయం ఏర్పడింది. ఇప్పుడాయన తెరాసలో ఉన్నారు. సరే అసలు విషయానికి వస్తే మేము చేపట్టే కార్యక్రమాలు పేపర్లో వచ్చేవి కాదు. అదే వేరే ఊర్లలో చిన్న చిన్న విషయాలు కూడా వార్తలుగా వచ్చేవి. ఇక్కడేమో మా అన్నయ్య ఫక్రుద్దీన్ రిపోర్టర్. ఆయన చార్ మినార్, రాజేంద్రనగర్ డేట్ లైన్లతో వార్తలు రాసేవారు. నేను రోజూ ఒక ప్రెస్ నోట్ ఆయనకు పంపేవాడిని. ఆయన మాత్రం ఒక్కరోజు కూడా నా పేరుమీద వార్తలు రాసేవాడు కాదు. నాకు చాలా నిరాశగా ఉన్నా ప్రెస్ నోట్ పంపటం మానలేదు. అయితే ఇక్కడే ఒక ట్విస్టు ఉంది. మా అన్నకు నా రాతలు బాగా నచ్చాయి. ఒక రోజు విషయాన్ని ఆయన తమ బాస్ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి చెప్పారు. ఆయనకూడా నా రచనాశైలికి ఇంప్రెస్ అయ్యారు. ఒకసారి మీ తమ్ముడిని తీసుకురా ఆఫీసుకు అని చెప్పారంట. అలా ఈనాడు ఆఫీసుకు వెళ్ళా. అక్కడ కొమ్మినేనిగారు నాకు ఎలాంటి టెస్టులు నిర్వహించలేదు. ఒరేయ్ అబ్బాయ్ రేపటినుంచి శివరాంపల్లి ఏరియాకు రిపోర్టర్ గా వార్తలు రాసి పంపించు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇంకేముంది మనం రిపోర్టర్ అవతారం ఎత్తేసాం. గమ్మత్తు ఏంటంటే వార్తా సేకరణ నాకు అస్సలు తెలియదు. రోడ్డు మీద వెళుతుంటే వార్తలు దొరికేస్తాయి అని నమ్మేవాడిని. అందుకే పొద్దున్నే లేచి బస్సులో ఏరియా మొత్తం తిరిగేవాడిని, లేకపోతే ఫ్రెండ్స్ బైక్ మీద రౌండ్ కొట్టి వచ్చేవాడిని. ఒక్క వార్తా దొరికేది కాదు. కాటేదాన్ లో అన్నకు ఒక ఆఫీసు ఉండేది. అక్కడికి వచ్చి ఈరోజు వార్తలు ఏమీ దొరకలేదని బిక్కమొహం వేసుకుని చెప్పేవాడిని. అన్నయ్య నవ్వి ఊరుకునేవాడు. ఇలా ఒక నెలరోజులు గడిచాయి. నా నుంచి ఒక్క వార్త కూడా లేదు. అన్నయ్య ఇలా కుదరదనుకున్నాడేమో.. వార్త రిపోర్టర్ మురళీధర్ అమర్ నాధ్ గారికి నన్ను అటాచ్ చేశారు. నెలరోజులు ఆయన వెంట తిరిగాను. వార్త సేకరణ ప్రజా సంబంధాలు వంటి విషయాలు నేను మురళి గారి దగ్గరే నేర్చుకున్నా..

1 comment:

  1. >> ఆయనకూడా నా రచనాశైలికి ఇంప్రెస్ అయ్యారు...
    నేను కూడా. ఈవిషయం చివర్లో వ్రాద్దామనుకున్నాను కాని ప్రస్తావనకు వచ్చింది కదా అని ఇప్పుడే అంటున్నాను.

    ReplyDelete