Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday, 9 August 2015

సరిపోదు ఈ జీవితం

సరిపోదు ఈ జీవితం

దినమొక ఘడియలా
ఘడియ ఒక నిమిషంలా
నిమిషం ఒక క్షణంలా
కాలమలా గడిచిపోయింది
కరుగుతున్న కొవ్వొత్తిలా
తల్లి ఒడిన చేరిన పసిపాపకు
కాలం సరిపోతుందా
జాబిలి వేళ
కలువకు మనసు నింపుతుందా
మరలా మరలా
వికసించాలని
కలువపువ్వు
వెన్నెల కోసం ఆరాటపడదా
నీతో పయనం
కాలం తెలియనీయదు
గడియారం ముల్లు
అలా అంత వేగంగా
ఎందుకు పరుగిడుతోందో
తెలియదు కానీ
సమయం పగబట్టినదేమో
అలా ఒక కలగా
కరిగిపోయింది
చాలదా ఈ సమయం అంటే
ఏమని చెప్పను
సరిపోదు నాకు
జీవితకాలం
మనస్వినీ

No comments:

Post a Comment