మనసులో మనసే
ఆలిలా పేరుపొందేవు
ఇల్లాలిలా హోదా
వెలగబెట్టేవు
తల్లిలా కనిపించేవు
ఆస్తులను చూసి
మురిసిపోయేవు
హక్కులు నావేనని
మిడిసిపడేవు
బంధువులూ
రాబందులూ
అందరి ముందు వగచేవు
ఆడదానివన్న సానుభూతిని
పొందేవు
కన్నీరు కార్చేవు
అహంకారమే చూపేవు
మౌనమే దాల్చేవు
కపటనాటకాలే
రచించేవు
అన్నీ నాకే
అంతా నేనేనని
డాంబికాలకు పోయేవు
అన్నీ ఉన్నా
హక్కులు
అనుభవిస్తున్నా
మనసులో మాత్రం
స్థానం పొందలేవు
మనసులో మనసువి కాలేని
నీకు
ఎన్ని ఉన్నా ఏమీ
లేనట్టే కాదా..
మనసులో ఉన్న మనసుకు
ఏమీ లేకున్నా
ఆమనసుకు అందరూ దూరమైనా
ఇల్లూ వాకిలి లేకున్నా
రాబందులు ఆదరించకున్నా
ఆ మనసుతో
సరితూగగలవా
అన్ని ఉండీ మనసులో
లేని మనిషికంటే
మనసులో కొలువైన
మనసే గొప్పది కాదా
అపురూపమైనది ఆడజన్మ అందుకే
ReplyDelete