నీలో ఎన్ని భావాలు...
పంకజ్ ఉధాస్ స్వరం నుంచి....
జాలువారిన గానామృతమా...
జగ్జీత్ సింగ్ గజల్ లోని...
విరహ వీచికల తరంగమా...
నండూరి ఎంకిలోని...
కవ్వింపుల సోయగమా...
చలం అక్షరాలకు...
మరో రూపమా...
శ్రీశ్రీలో ఉదయించిన ...
మరో ప్రపంచమా...
ఏ కోణంలో చూడను నిన్ను...
అన్ని కోణాలు నీవే..
మధురం నీవే...
విషాదం నీవే..
కవ్వింపులూ నీవే..
అభ్యుదయం నీవే...
విప్లవమూ నీవే...
ఓకే అతివలో ...
అన్ని రూపాలు అంటే...
అది నీవే కదా..
మనస్వినీ..
No comments:
Post a Comment