నా అక్షరం ఒక పుష్పం..
అప్పుడు రాసుకున్నా...
ఇప్పుడూ రాసుకుంటున్నా....
నాటి నా అక్షరాలు ...
ఒక వెలుగుకోసం ఆరాటపడ్డాయి...
అంబరం నుంచి ....
రాలిపడుతున్న ....
తారకలను ఏరుకుని ....
పదాలుగా అల్లుకున్నా....
జాబిలి రాతిరి చల్లదనం లో...
భావాలను దాచుకున్నా...
నిశిరాతిరి పరదాలపై...
స్వప్నమై నర్తించా...
ఉందో లేదో తెలియని ....
నిజమో కాదో అర్థం కాని...
తనకోసమే...
మదిలోభావాలను ...
పదిలం చేసుకున్నా...
ఇప్పుడూ రాస్తున్నా...
ఊహల లోకం వీడి...
స్వాప్నిక జగత్తును దాటి....
మళ్ళీ రాస్తున్నా...
ప్రతి అక్షరాన్ని ....
ఒక పుష్పం లా మార్చి...
నీ పద చరణాలకు ...
అంకితం ఇస్తున్నా....
నా పువ్వులను ...
నీ సిగలోతురుముకుంటావా...
మనస్వినీ...
No comments:
Post a Comment