అంతా అబద్దమేనా..
మనసున మనసై...
ప్రతిక్షణం జతగా...
అడుగులో జాడగా...
తనువూ మనసూ ఒకటై...
తను నేనుగా...
నేను తనుగా...
అనుభవంలో నుంచి...
అనుబంధంలోకి...
అనురాగం నుంచి...
అనురక్తిలోకి...
నాలోనుంచి...
తనలోకి...
తనలో నుంచి.. .
నాలోకి...
ఇద్దరూ ఒక్కరిగానే...
గడిపిన క్షణాలు...
పొందిన అనుభూతులు...
పంచుకున్న అనుభవాలు...
అన్నీ అబద్దాలే అనుకుంటే...
మనస్సూ అబద్దం...
అనుభవమూ అబద్దం...
అనుబంధమూ అబద్దం...
ఇంకా నిజమెలా ఉంటుంది...
మనస్వినీ...
No comments:
Post a Comment