కనుల కొలనులో ...
ఉదయించిన కమలమే నీవని...
మేఘమాలికల
అల్లికలో వికసించిన...
జాబిలమ్మవు నీవేనని...
మరుమల్లెలపై ...
కురుస్తున్న మంచు బిందువు నీవని..
కడలి అలలపై ...
తెలియాడే మేఘమే నీవని...
నా శ్వాసకు ఊపిరిపోసే ...
ప్రాణవాయువే నీవని...
నా గుండె గుడిలో ...
ప్రమిదవే నీవని...
నా అనుభూతులను ...
భావాలుగా రంగరించి...
అక్షరాలుగా రాసుకుంటున్నా...
నా అక్షర మాలికలను ...
ఆదరించి అక్కున చేర్చుకుంటా వో...
విసిరేస్తావో ...
నీ ఇష్టం ...
మనస్వినీ...
No comments:
Post a Comment