రుధిర విలాపం...
ఏమిటీ మంట....
ఎక్కడ అగ్గి రగులుకుంది....
ప్రశాంతంగా ఉన్న
కొలనులో....
ఎందుకు ఈ అల్లకల్లోలం....
చల్ల బడుతోందనుకున్న రుధిరంలో...
ఎందుకు వేగం
పెరిగింది...
తడి ఆరిపోయిన గుండె గోడలపై...
మళ్ళీ చెమ్మ పేరుకు పోయిందేమిటి...
అదేంటి ఏదో మెలిపెట్టిన బాధ...
ఎదో గుచ్చుకుంటున్న
వేదన....
అవును గుండె గోడలకు ఏదో గుచ్చుకుంది...
ఎద గోడల నుండి....
స్రవిస్తున్న రుధిరం....
అలా అలా..
ఒక అలలా ...ప్రవాహంలా...
అంతరాలను గాయం చేస్తూ...
నాడీ వ్యవస్థను ఛిన్నా భిన్నం చేస్తూ...
ముందుకు సాగుతూనే ఉంది...
రుధిర ప్రవాహ వేగంతో...
హృదయం తన లయను తప్పి...
క్రమంగా కుచించుకు పోతోంది....
ఏమీ అర్ధం కాని అయోమయంలో...
స్పందనలు మందగిస్తున్న హృదయానికి ....
క్రమంగా తెలిసింది...
తనలో...తన అంతరాల్లో...
ఎక్కడో ఒక చిన్న...
గులాబీ ముల్లు గుచ్చుకుందని...
ఏం చేస్తుంది.....
అది తనెంతో అపురూపంగా ....
ప్రేమించే గులాబీ రేకుల్లో...
దాగి ఉన్న ముల్లని...
ఆ ముల్లు రంపపు కోతకు ....
బాటలు వేస్తున్నా...
ఆ మనసు గులాబీ ని ....
అంతమయ్యే వరకు ....
ఆరాధిస్తూనే ఉంటుంది...
స్రవిస్తున్న రుధిరంతో......
విలపిస్తూ ....
ప్రేమ లేఖలు రాస్తూనే ఉంటుంది...
మనస్వినీ...
No comments:
Post a Comment