పుడమి పులకింత...
కుర్చీలో కూర్చుని....
పెరటి వైపు చూస్తున్నా....
రోజూ విరబూసే గులాబీ ని
చూసాను....
ఏదో మార్పు....
నవ్వులు విరబోసే...
ఆ గులాబీ బాల ఎందుకో ఏమో చిన్నబోయింది...
లేత వన్నెలలో ఏదో తెలియని..
వేదన కనిపించింది...
అది రోజు నేను నడిచే బాటే...
ఏదో తెలియని మార్పు...
ఆ బాట నాకేదో చెబుతోంది....
పరికించి చూసాను....
మనస్సు చివుక్కుమంది...
ఆ బాట నాకు వీడ్కోలు చెబుతోంది
ఎందుకో....
పరిసరాల్లో ఏదో తెలియని గుంభనం...
ఆ చెట్లు... ఆ చిగురాకులు....
లయబద్దంగా ఊగటం మానేశాయి...
అంతా నిశ్చలనం....
తెల్లారగానే సవ్వడి చేసే పక్షుల కిలకిల రావాలు....
కోయిలమ్మ కువకువలు....
అన్నీ మూగబోయాయి ఎందుకో....
నేను రోజు నడిచే
నేల....మధురవాసన వేసే మట్టి...
ఎందుకో నేను పాదం మోపగానే....
నన్ను ఆర్తిగా ఆరాధనగా..
ముద్దాడుతున్న అనుభూతి...
సర్వం వీడ్కోలు చెబుతున్నా...
పుడమి నా పాదాల్ని ముద్డాడుతూ స్వాగతం పలుకుతోంది..
ఒక వైపు వీడ్కోలుతో కళ్ళు
చెమర్చినా...
పుడమి పులకింత తో...
రాలుతున్నవి ఆనంద భాష్పాలే....
మనస్వినీ...
No comments:
Post a Comment