దేవుడిచ్చిన కానుకవే
మొదటినుంచీ నాకు
ఒక లెక్క ఉంది
ఊహ మొగ్గ తొడిగిన నాటి
నుంచీ
ఒకే భావముంది
ప్రాయం వికసించిన నాటి
నుంచీ
నా ఊహలు
నా భావాలు
ఓ తెలియని ఆకారం వెంటే
నడిచాయి
నా అక్షరాలు
నా కవితలు
నాకు తెలియనే తెలియని
ఊహా సుందరి చుట్టే
తిరిగాయి
నా మనసు సొదలు తనకే
చెప్పుకున్నా
నా ఆశలూ ఆకాంక్షలు
తనతోనే పంచుకున్నా
తను లేకున్నా ఎప్పుడూ
నా ఎదలోనే ఉంది
ఆ అందం
ఆ పరువం
ఆ సోయగం
నిత్యం నా మనసు పుస్తకంలో
అందమైన అక్షరంలా
మెరుస్తూనే ఉంది
నేను అతిలోక సుందరిని
ఊహించలేదు
కథలూ కథానికలలో మెరిసే
అప్సరస ను కోరుకోలేదు
నాకు నచ్చిన అందాన్ని
కోరుకున్నా
నేను మెచ్చిన మనసును
తలుచుకున్నా
నాతో మాట్లాడాలనీ
నాతోనే ఉండాలనీ
నా కోసమే నవ్వాలనీ
నా కోసమే తపించాలనీ
నా కోసమే కన్నీరు
పెట్టాలనీ
ప్రతినిమిషం నేనే
కావాలనీ
తానే నేనై
నేనే తానై
నిలిచిపోవాలనీ
అందమైన కలలకు ప్రాణం
పోసుకున్నా
నీలోనే కనిపించింది నా
మనసు
నీ నవ్వులోనే
వికసించింది నా భావం
నీ కన్నులలో మెరిసింది
నా స్వప్నం
ఊహలలో విహరించిన
సుందరి నీవేనని
నమ్మింది నా మనసు
నీవూ నీ అందం
నీవూ నీ వ్యక్తిత్వం
నీవూ నీ మనసు
నీవూ నీ ఆవేశం
అన్నీ నా మనసులో దాగిన
స్వప్నాలే
అన్నీ కలగిపిన నీవు
నాకు దేవుడిచ్చిన
కానుకవు కాక ఇంకేమవుతావు
నీకు ఎంత సీన్ ఉందో
నీకెలా తెలుస్తుంది
మనస్వినీ
No comments:
Post a Comment