తనువే ఓ గ్రంథమై...
కవితలు రాయగా
అక్షరాల అల్లికలు ఎందుకు
నాకు
ప్రణయగీతికల కోసం
భావాల పువ్వులు
ఎందుకు నాకు
నీ మనసు ఒక పుష్పమై
నీ తనువు ఒక పుస్తకమై
నిత్యం నాలో
విరితేనెల అక్షరాలకు
బీజం వేస్తే
కొత్త అక్షరాలు
పుట్టుకు రావా
కొత్త భావాలు మారాకు
తొడగవా
దాహంతో అలమటించిన నా
మనసుకు
నీ మనసు దప్పిక
తీరిస్తే
సాంత్వన పొందిన మనసు
ప్రేమ గీతాలు పాడదా
నీ దేహంలోని ప్రతి
అణువూ ఒక తెల్లకాగితమై
నిత్యం నవవసంతాలకు
స్వాగతం పలికితే
నా శ్వాసతో నీ ఎదపై
మనసు సొదలు రాసుకోనా
అధరం ఒక అక్షరానికి
జీవం పోస్తే
కన్నులు వెన్నెల
రాగాలు పలుకవా
ఎద పొంగుల కెరటాలకు
మనసులో రంగు రంగుల
భావాలు
ఊపిరి పోస్తుంటే
నా మనసు తనంతట తానే
కవిరాజులా కవితలను
విరజిమ్మదా
మనస్వినీ
No comments:
Post a Comment