భావరహితమానసం
ఒక అందమైన భావాన్ని
అందమైన అనుభవంలా
మలుచుకోవాలని అనుకున్నా
గుండెలోతుల భావం
మనసును మెలియపెడుతూ ఉంటే
ఆ మనసు సొదను
అక్షరాలుగా అల్లుకోవాలని
ఎంతగానో అనుకున్నా
ఎందుకో ఏమో
నా నేస్తాలు అలక నేర్చుకున్నాయి
అలిసిపోయాయేమో
నా అక్షరాలు బయటికిరాలేమని
మొరాయిస్తున్నాయి
ఏం జరుగుతోంది
నా అంతరంగ మాలికలు
నా అక్షరాలు ఎందుకు తిరగబడుతున్నాయి
నిజంగా తప్పు నా అక్షరాలదేనా
అక్షరాలను అల్లుకోలేని నా మనసుదా
భావావేశంతో సతమతమయ్యే
నా మానసం భావరహితమయ్యిందా
అప్పుడప్పుడూ
చలనం కోల్పోయే మానసం
నవచైతన్యానికి సంకేతమేనేమో
మనస్వినీ
No comments:
Post a Comment