నేనే లేకపోతే
దో గజ్ జమీన్ భీ నా మిలీ అంటూ
జఫర్ ప్రవచించిన గజల్ గుర్తుకు వస్తోంది ఎందుకో...
అయ్ గమే జిందగీ అంటూ
పంకజ్ ఉధాస్ గళం నుండి జాలువారిన స్వరం
చెవులలో తిరుగుతోంది ఎందుకో...
యే దునియా యే మెహఫిల్ మేరే కామ్ కి నహీ అంటూ
రఫీ సాహెబ్ గీతం గుండెల్లో గుచ్చుకుంటూనే ఉంది ఎందుకో...
అవును
ఎందుకో ఆలోచనలు ఆ భావాల చుట్టే తిరుగుతున్నాయి
ఆ గీతాలు ఎందుకో నావే అనిపిస్తున్నాయి
నాకోసమే రాసారనీ
నాకోసమే పాడారనీ
ఎందుకో మనసు చెబుతోంది
ప్రతి భావంలో నేనే కనిపిస్తున్నా
ఆ ఆవేదనలో రాగమై విలపిస్తున్నా...
నిజమే
విలువలేని సమాజంలో
మనసుకు విలువ కట్టేది ఎవ్వరు
ఎందుకు ఇవన్నీ
ఎవరికోసం ఇదంతా
నేనే లేకపోతే
ఈ లోకం ఎందుకు
రంగురంగుల ప్రపంచం ఎందుకు
ఎవరికోసం ఈ ప్రకృతి అందాలు
సుందర జలపాతాలు
సిరులూ సంపదలూ
నవ్వులూ కేరింతలు
ఎవరికోసం
ఒక్క క్షణం ఆలోచిస్తే
ఇదంతా నాదేనా
నాదే అయితే నాతోనే వస్తుందా
నేను శాశ్వతమా
ఏదీ కాదు కదా
నేనే లేకపోతే ఇదంతా శూన్యమే కాదా
జీవించే నాలుగు ఘడియల కోసం
ఇంత ఆరాటం ఎందుకు
పనికిరాని పోరాటం ఎందుకు
నేను అన్నది లేని నాడు
ఏదీ లేదు కదా
మనస్వినీ...
బావుంది. అయితే చిన్న పిల్లలు చంద్రడు వస్తే తమకోసమేనని, తారలు మెరిసేది తమకోసమేనని ప్రకృతి పరిమళించేది తమకోసమేనని అందమైన భావనలో ఉంటారు మన టైం బావోపోతే అంతా అంధకారంగా కనిపిస్తుంది. ఆ భావం మనని మనం ఇంకొంచెం ప్రేమించుకునేలా చేస్తుంది. మనసుకీ హాయిగా ఉంటుంది. శాంతి మన స్వ ధర్మం కనుక
ReplyDelete