స్వాతిచినుకువి నీవు...
ఉషోదయ వేళలలో ...
మంచు బిందువుల ....
జాలు వారిన ....
స్వాతి చినుకువు నీవు....
ప్రకృతి కాంత కంఠ సీమలోని..
పచ్చని హారం లోనుంచి...
జారి పడిన మేలి ముత్యానివి నీవు...
నెలవంక వెన్నెలలో...
మరిపించి మురిపించే..
పసిడి వన్నెవు నీవు...
దినకరుడి వలపు తాపానికి...
పులకించే కలువబాల ...
సోయగానివి నీవు...
మల్లికలోని ...
వయ్యారం నీవు...
గులాబిలోని ....
రాజసానివి నీవు...
ఒక్కటేంటి....
ప్రకృతి లోని ...
సమస్తం నీవు...
సామాన్యుల అలంకరణలు...
నీ అందానికి సాటి రాగాలవా...
సహజ సుందరివి నీవు...
అలంకరణలకే ...
నీవు అలంకారం కాదా...
మనస్వినీ....
No comments:
Post a Comment