కడలి కెరటాన్ని నేను...
చిన్న బిందువులా....
ఒక మహా శక్తిలా...
గాలితో పోటీ పడుతూ...
కడలిని వెనక్కి నెట్టివేస్తూ....
పరుగులు తీసే కెరటాలు....
కడలిని వదిలేసి వెళ్లి పోతాయా....
పరుగులు తీసే కెరటాలకు...
కడలి తో అనుబంధమే లేదా...
ఎంత వేగంగా పరుగు తీసినా...
ఆ కెరటాలు మళ్ళీ ....
కడలి కౌగిలిలో...
లీనమైపోవా...
వెన్నెల ఎంత కురిసినా...
జాబిల్లిని వీడితే....
దానికి మనుగడ ఉందా...
మరి ఊపిరే నువ్వైతే...
నా శ్వాస ఉంటుందా...
కడలివి నువ్వైతే....
కెరటాన్ని నేను కానా...
జాబిల్లివి నువ్వైతే ......
నేను చల్లని వెన్నెలను కానా...
ఎలా విడవగలను నిన్ను ....
నా దేహంలో నీ ప్రాణం ఉన్నంత వరకు....
మనస్వినీ....
No comments:
Post a Comment