నా సమాధి..
నా కన్నులు తెరిచే ఉన్నాయా...
లేక మూసి ఉన్నాయా...
అంతా గాడాంధకారం...
అయినా కన్నులు తెరిచేందుకు...
నా ప్రయత్నం....
కనురెప్పల్లో రవ్వంత కదలిక లేదు...
తనువంతా నిశ్చలమే...
ఏం జరుగుతోందో తెలియటం లేదు..
మట్టి పొరలు....
రాతి తెరలు...
నన్ను కప్పివేస్తున్నాయి...
అంధాకారం మరింత అలుముకుంది...
నా పై చల్లిన సుగంధ పరిమళాలు...
మెల్లగా తమ వాసనను కోల్పోతున్నాయి...
క్రమంగా మట్టివాసన వ్యాపిస్తోంది..
రాళ్ళు... మట్టి ..మెల్లగా నా దేహాన్ని
అదిమేస్తున్నాయి...
ఆ మట్టి పొరల్లో...రాతి తెరల్లో...
చిన్న కదలిక...
చల్లదనాన్ని దూరం చేస్తూ...
ఆ మట్టి లోంచి ఉబికి వచ్చి....
నా దేహంపై నులి వెచ్చగా...
జారిపడింది ఓ నీటి చుక్క...
అప్పుడర్ధమయ్యింది నాకు...
నేను మృత్యు ఒడిలోకి జారుకున్నానని...
నన్ను సమాధి చేశారని...
నా దేహాన్ని ఆర్తిగా తడుముతున్నది...
నీ కన్నీటి చుక్కని...
మనస్వినీ....
No comments:
Post a Comment