వసంతవిలాపం.....
ఇది విరిసిన వసంతమా....
తరలిపోతున్న రుతు రాగమా....
అవి విచ్చుకుంటున్న మారాకులా...
వాడిపోతున్న
ఎండుటాకులా...
అన్ని నాతోనే ఉన్నట్టున్నాయ్...
మరి ఎందుకు నాకు దూరంగా పారిపోతున్నాయ్...
అంతా హాయిగానే ఉంది...
ఎందుకు మరి ఎదో గుబులుగా ఉంది...
నా మనసుకు దారిచూపిన మనసే....
మరి ఎందుకు మనసునే నులిమేస్తోంది.....
విరిసిన వసంతం వాడినట్లు ఎందుకుంది..
మనసే మనసుతో ఎందుకు ఆడుకుంది...
ఇది వసంతమేనా...
మనస్వినీ....
No comments:
Post a Comment