నాకు ఆ లోకం కావాలి...
నా తొలి అడుగు పడింది...
ఆశ్చర్యం....
నా పాదాలకు నేల ఆనలేదు...
పాదాల కింద నేల లేనే లేదు...
మెత్తగా...పాలమీగడలా.....
తేలియాడుతున్న దూది పింజంలా...
కళ్ళు పరికించి చూశాను...
నేను మేఘమాలికలపై..
నిలబడి ఉన్నాను...
ఏమీ అర్ధం కాక....
భయం భయంగా...
కిందికి చూస్తూనే...
ముందడుగు వేశాను...
ధైర్యం కూడ దీసుకుని...
ముందుకే కదిలాను...
కళ్ళముందు మరో లోకం...
అవును అది మరో ప్రపంచం...
పుడమి లేని ప్రాంతం....
అంతా మేఘమాలికల అల్లికలే...
దూరంగా అందమైన సరస్సులు...
కొలనులో తేలియాడుతున్న....
హంస రాజాలు...
అవి చూసి మైమరిచే తరుణంలో...
అల్లంత దూరంలో...
మనసును దోచే పూదోటలు...
పక్షుల కువ కువలు...
ఎక్కడ చూసినా ఆహ్లాదమే....
కష్టాలు కన్నీళ్లు...
బాధలూ ఆవేదనలు...
ఎక్కడా కానరాలేదు...
అసలు నేను నేనేనా అన్న భ్రాంతి...
ఏమయితేనేం...
నాకు ఆ లోకం కావాలి...
మనస్వినీ...
No comments:
Post a Comment