కథానాయిక...
మసకేసిన మబ్బులు.....
జాబిలమ్మతో దోబుచులాడుతున్నవేళ..
పోరాటం ఆరాటాల మధ్య...
కురిసీ కురియని వెన్నెల
రాతిరిలో....
ఉండీ లేనట్టుగా ఉన్న
నిశీధిని...
చీల్చుకుంటూ...
ఓ తారక నేల రాలుతున్న వేళ.....
సంభ్రమంగా నేను ....
ఆకాశం వైపు చూడగా....
ఓ కాంతి పుంజం....
అలలా సాగుతూ....
పుడమి వైపు జారింది...
అంతలోనే తెల్లని పాల మీగడలా మరో
మేఘం...
లయబద్దంగా...దూసుకువచ్చింది...
కొద్ది సేపు ఏం జరిగిందో...
కళ్ళు నులుముకుని చూస్తే...
ఆకాశానికి మార్గం వేసినట్లు...
దూది పింజాల్లా తేలుతున్న
మెట్లు ....
ఆశ్చర్యం...
ఆ మెట్లపై మరో కాంతి పుంజం...
ఆ మేఘం మెల్ల మెల్లగా...
ఒక ఆకృతిలా....
అందమైన దేవకన్యలా...
తేలియాడుతూ...
నా వైపు దూసుకువస్తోంది...
ఆమె నా దరికి చేరి....
సుతారంగా నా చెయ్యి
అందుకుంది...
ఆ స్పర్శ తేనె పూసిన మఖ్
మల్ వస్త్రంలా...
గులాబీలోని సుకుమారత్వం లా ...
నన్ను మైమరిపించింది...
ఆమె నాచేయి అందుకుని ముందుకు
సాగుతోంది...
నేనూ మేఘంలా తేలిపోతూ ఆమె వెంట
సాగిపోతున్నా...
అది ఏ లోకమో తెలియదు...
కళ్ళు తెరిస్తే....అంతా
మాయం...
అనేక రాత్రులను నిద్ర లేని
రాత్రులుగా మార్చిన....
ఆ స్వప్నంలో కథానాయిక ఎవరు...?
అది నువ్వే కాదా...
నువ్వు అవునన్నా... కాదని
మారాం చేసినా...
ఆ స్వప్నిక నువ్వు కాక ....
ఇంకెవరు....
మనస్వినీ...
No comments:
Post a Comment