నిజమైన కల...
అలలు లేని కడలిలా...
తీరం చేరని అలలా ...
కాంతులు లేని తారకల్లా....
మెరుపులంటేనే తెలియని
మేఘమాలికల్లా...
పరిమళాలు చిందించని
మరుమల్లెలా...
ప్రశాంతంగా....మౌనంగా
....
ఊసులు ఊహాలు లేని
నా మానసిక సంద్రం లో ...
ఉబికి వచ్చిన కెరటం
లా....
ఊసులు చెప్పే చందమామలా...
మనసు లోతుల్లో సవ్వడి
రేపిన మలయ సమీరంలా..
మనోవీణ తంత్రులు
మీటుతూ...
ఒక కలలా...అందమైన నిజం
లా...
హృదయ ఫలకం పై పాదం మోపిన
నీవు...
ఏమని చెప్పను నా భావాలు..
పెదాలు దాటని అర్థాలు...
భాషే లేని భావాలు...
పెదాలు దాటని అర్థాలు...
అన్నీ కలగలిపి
చెబుతున్నాయి...
పలుకుతున్నాయి...
కలలు కంటున్నాయి..
నిజమైన నా ఊహా సుందరి నీవేనని...
అదే ఓ అందమైన నిజమని...
అది నువ్వేనని...
మనస్విని...
No comments:
Post a Comment