Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday, 24 November 2014

తొలిక్షణం...



తొలిక్షణం...

ఎందరినో చూసాను....
మరెందరితోనో మాటలు కలిశాయి...
కదులుతున్న కాలం సాక్షిగా ...
ఇంకెందరో....
తోడు నడవాలనుకున్నారు...
మనస్సు చలించలేదు...
మమత పెరగలేదు...
నిన్ను చూసిన ఆ తొలి క్షణం....
లిప్తపాటు గుండె ఆగిపోయింది...
నీ కనుల కొలనులో....
నీ నయనాల సాగారాల్లో....
ఎన్నెన్నో ఆశలు....
నాతో పెన వేసుకున్న బాసలు ....
లీలగా కనిపించాయి...
నీ అధర సుధల్లో....
నేను నిత్యం...
నెమరు వేసుకునే....
అమృత భాండాలు....
రుచి చూపించాయి...
నీ పెదాల మాటున....
జాలు వారుతున్న పలుకులు....
నేకన్న కలలను తలిపించాయి...
నిజానికి ....
నీ అందం మాత్రమే....
నన్ను ఆకట్టుకోలేదు....
అంతులేని ....
నీ అనురాగం.....
దాన్ని మించిన వ్యక్తిత్వం...
నన్ను నీ వైపు నడిపింది...
నేను గెలిచాను...
నా అంతరంగాల ....
గురి తప్పలేదు...
మనస్వినీ...

2 comments: