కన్నీటి పువ్వులు...
మండుటెండల్లో....
ఇసుక తిన్నెల్లో...
నడియాడిన.. నీ పాదాలు...
అలసిపోలేదు....
ప్రచండ గాలులు వీస్తున్నా...
గొంతు ఎండిపోతున్నా...
పెదాలు తడారి పోతున్నా...
నీవు దాహార్తివి కాలేదు...
ఎండమావులు ఎదురైనా...
నీవు అలసిపోలేదు....
సాగరం పొంగి ఉప్పెనలా...
ఎదురొచ్చినా...
నీవు చెక్కు చెదరలేదు...
ఇప్పుడెందుకు ...
నీ అంతరంగం లో సుడిగుండాలు...
చెలరేగుతున్నాయి...
చెమర్చిన నీ కళ్ళలో ...
ఎందుకు తడి ఆరటం లేదు...
నాడు అంతా పోరాటమే....
అన్నీ ఎదురీతలే....
అయినా చలించలేదు...
ఇప్పుడేమయ్యింది నీకు...
బేలగా మారి పోయావు...
నీ కనుల సుడులనుంచి జాలు వారుతున్న...
ఆ జలధార విలువ నీకు తెలుసా...
కనుల కొలను నుంచి దొరలుతున్న ...
కన్నీటి చుక్కలు చూడు....
పుడమి పై పువ్వులుగా ....
మొలకెత్తుతున్నాయి చూడు...
కడలి గర్భంలో దాగి ఉన్న ...
ముత్యాల్లా...
ఎలా మెరుస్తున్నాయి చూడు...
అమూల్యమైన ఆ సంపద ....
నా కోసం పదిలపర్చు ....
మనస్వినీ...
nice one bhai. :)
ReplyDelete