విరిసిన మందారం...
చల్లని వెన్నెల కురిపించే...
చందమామ ప్రతిబింబం...
అందమైన ముఖారవిందం..
అందానికి వన్నెలు దిద్దే సోయగం...
మీనాలకు ఈత నేర్పే...చక్కని నయనాలు...
అంతకు మించి గాఢమైన అంతరంగం...
ఆ అంతరంగాలలో పయనించే నేను...
నిన్ను చూడగానే ఏమనుకుంటాను...
నిన్ను చూసి ఎలా స్పందిస్తాను...
నీ పలుకులు తూటాల్లా గుండెను చీల్చుతుంటే ...
నిన్ను ప్రేమించటం మానేస్తానా...
ముళ్ళున్నాయని గులాబీని అసహ్యించుకుంటానా...
పూరెమ్మల మాటున దాగి ఉన్న ముళ్ళను
దాటితేనే...
గులాబీని అందుకుంటానని నాకు మాత్రం
తెలియదా...
నువ్వు నా అందమైన గులాబీవే ....
మనస్వినీ.....
No comments:
Post a Comment