Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday, 13 November 2014

ఊహాసుందరి


ఊహాసుందరి
నా  స్వాప్నిక లోకంలో...
నా చేయందుకుని ....
అలల తీరాలను దాటుకుంటూ 
మేఘాల అంచులను  తాకుతూ...
ఏవో తెలియని లోకాల్లో ...
నన్ను విహరింపజేసిన ....
ఆ జవ్వనిని....                                                  
ఎలా మరువగలను...
తను లేనేలేదు....
ఆమెకు రూపమే లేదు...
ఆమె ఉనికి ఎక్కడా కనిపించదు....
కానీ ఆ నవ్వుల పువ్వులు...
నిత్యం నా మనసులో గిలిగింతలు రేపాయి...
ఆ నయనాల వెలుగులు నాకు ఊపిరి పోసాయి...
ఆ చేతి స్పర్శ నాలో చైతన్యాన్ని రేపింది...
ఆ అడుగుల జాడలు జీవితాన్ని ముందుకు నడిపాయి...
ఎక్కడా లేని తను  నా భావనలకు ప్రాణం పోసింది...
ఇప్పుడు ఆమె ఉనికి తెలిసింది...
ఆనవ్వుల పువ్వులు నా స్వంతమయ్యాయి....
నాటి అన్నీ ఇప్పుడు నావే...
అవును ...
నాటి నా ఊహా సుందరి...
నేటి నా నువ్వే...
మనస్వినీ...

No comments:

Post a Comment